మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

మాలీవుడ్‌లో విషాదం : దర్శకుడు కన్నుమూత

Kaithapram Viswanathan,
మలయాళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన సంగీత దర్శకుడ కైతప్రమ్ విశ్వనాథన్ నంబూద్రి (58) ఆదివారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మృతివార్తను కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
1963లో సంగీత కుటుంబంలో జన్మించిన ఆయన సంగీత టీచరుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 20కి పైగా చిత్రాల్లో నటించారు. గత 2001లో కన్నకి చిత్రానికి స్టేట్ అవార్డును అందుకున్నారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు.