శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (17:27 IST)

మనిషి శరీరంలో మాంసం భక్షించే బ్యాక్టీరియా.. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

eating bacteria
మనిషి శరీరంలో ఈటింగ్ బ్యాక్టీరియాను గుర్తించారు. పైగా, ఈ బ్యాక్టీరియా సోకిన వ్యక్తి మృత్యువాతపడ్డారు. ఇటీవల ఓ వ్యక్తి రైలులో నుంచి జారి కిందపడ్డాడు. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఆయనకు తగిలిన గాయాలకు ఖరీదైన మందులతో వైద్యం చేసినప్పటికీ అవి మానలేదు. దీంతో శరీరం నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్ష కోసం వైద్యకాలేజీ ప్రయోగశాలకు పంపించారు. అక్కడ జరిపిన ప్రయోగాల్లో శరీర కండరాలను తినేసే బ్యాక్టీరియా ఆ వ్యక్తి శరీరంలో ఉన్నట్టు గుర్తించారు. పైగా, ఈ బ్యాక్టీరియా సోకిన వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోయాడు. మృతుడి పేరు మృణ్మయ్ రాయ్ (44)గా గుర్తించారు. ఈ ఘటన కోల్‌‍కతాలో వెలుగు చూసింది. 
 
ఈ బ్యాక్టీరియాను నెక్రోటైజింగ్ ఫాసిటిసీ అని పిలుస్తారని వైద్యులు వెల్లడించారు. ఇది అత్యంత ప్రాణాంతక నెక్రోసిస్ ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని తెలిపారు. చర్మ కింది కణజాలంతో వ్యాపించే ఈ మాంస భక్షక బ్యాక్టీరియా ఎంతో అరుదైనదిగా వైద్యులు గుర్తించారు. ఇది ఎంతో వేగంగా వ్యాపిస్తుందని, సకాలంలో గుర్తించి చికిత్స చేయకుంటా ప్రాణాలకే ప్రమాదమని వారు హెచ్చరించారు. కాగా, మృణ్మయ్ రాయ్ మద్యపానానికి బానిస అవడం వల్ల అతడిలో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని, అందుకే అతడు నెక్రోసిస్‌కు త్వరగా ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.