ఆదివారం, 4 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (22:26 IST)

చికెన్ సూప్‌తో జలుబును వదలగొట్టవచ్చు (video)

chicken soup
సీజన్ మారుతుంది కదా. దీనితోపాటు సహజంగా వచ్చే సమస్యలు జలుబు, దగ్గు. ముఖ్యంగా జలుబు తగులుకున్నదంటే ఓ పట్టాన వదిలిపెట్టదు. ఐతే ఈ సమస్యను సహజసిద్ధ పద్ధతుల్లో ఎదుర్కోవచ్చు. చికెన్ సూప్ జలుబు చికిత్సకు ఒక ప్రసిద్ధ ఇంటి నివారణగా ఉపయోగించబడుతుంది. చికెన్ సూప్ కొన్ని రోగనిరోధక ప్రతిస్పందనలను నిరోధిస్తుందని తేలింది. ఇది సాధారణ జలుబు లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. జలుబుతో ముక్కు కారుతున్నప్పుడు వేడివేడి చికెన్ సూప్ తాగితే అది అత్యంత ప్రభావవంతంగా పనిచేసింది.

 
తేనె చుక్కతో అల్లం ముక్క తింటే జలుబుకి అడ్డుకట్ట వేయచ్చు. ఎందుకంటే... అల్లంలో జింజెరోల్స్, షోగోల్స్ వంటి క్రియాశీల సమ్మేళనాలున్నాయి. వీటిలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ పదార్ధాలున్నాయి. సాంప్రదాయ వైద్యంలో దగ్గు, జలుబు నివారణగా విస్తృతంగా ఉపయోగిస్తారు. అల్లం ముక్కపై తేనె చుక్క వేసి దాన్ని నమలవచ్చు. కప్పు నీటితో ముక్కలు చేసిన లేదా తురిమిన అల్లం ఉడకబెట్టడం ద్వారా అల్లం టీని కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని తాగుతుంటే జలుబు తగ్గుతుంది.

 
పసుపుతో దగ్గు, జలుబు, వాపు తగ్గుతాయి. పసుపు శక్తివంతమైన యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్. పసుపు రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో సహాయపడుతుంది. అలాగే జలుబు సమస్యను వదలగొట్టడంలోనూ పసుపు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.