ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2022 (23:10 IST)

జలుబు, దగ్గుకి అల్లం- ఎలా తీసుకోవాలి? (video)

వర్షా కాలంలో చాలావరకు సీజనల్ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. వీటిలో మరీ ఎక్కువగా వేధించే సమస్య దగ్గు, జలుబు. అల్లం తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి. ఎలా తీసుకోవాలో చూద్దాం.

 
టీతో - అల్లం తురుమును టీలో మరిగించి త్రాగాలి.
 
నీటితో - ఒక గ్లాసు నీటిలో కొన్ని అల్లం ముక్కలు వేసి వేడిగా ఉన్నప్పుడు త్రాగాలి.
 
కూరగాయలతో - అల్లం తురుము, కూరగాయలలో వేసి ఉడికించాలి.
 
తేనెతో - అల్లం చూర్ణం చేసి దాని రసాన్ని ఒక చెంచా తీసి అర చెంచా తేనెతో కలిపి త్రాగాలి.
 
చట్నీతో - అల్లం గ్రైండ్ చేసి పేస్టులా చేసి చట్నీలో కలుపుకుని తినవచ్చు.
 
సలాడ్‌తో - తురిమిన అల్లం సలాడ్‌తో కలపవచ్చు.
 
బెల్లంతో పాటు - బెల్లం కలిపిన కొన్ని అల్లం ముక్కలను కూడా తీసుకోవచ్చు.
 
ఇంటి చిట్కాలు సమాచారం కోసం మాత్రమే. డాక్టర్ సలహా తీసుకుని చిట్కాలు పాంచవచ్చు.