శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 14 అక్టోబరు 2022 (20:34 IST)

జలుబు, ఫ్లూ వ్యాధులు సోకకుండా ఎలా నివారించాలి?

cold
జలుబు, జ్వరం, దగ్గు లేదా ఫ్లూ బారిన పడకుండా ఈ చర్యలు తీసుకోండి. రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి, కానీ నీటిని కాచి చల్లార్చి తాగాలని గుర్తుంచుకోండి. వెల్లుల్లి, మిరపకాయలు తినండి. వెల్లుల్లి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది, మిరపకాయ సైనస్ రద్దీని తగ్గిస్తుంది.

 
విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. ఆహారంలో పుట్టగొడుగులు, నిమ్మ, తేనెను చేర్చండి. జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. రెడ్ మీట్, గుడ్లు, పెరుగు, తృణధాన్యాలు చేర్చండి. నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ సూప్ తీసుకోవచ్చు. ఇందులో సిస్టీన్ ఉంటుంది, ఇది కఫాన్ని వదలగొడుతుంది.

 
రోజూ రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగాలి. కొద్దిగా ఉప్పు వేసి చిన్ని అల్లం ముక్క తినండి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ విషయంలో, ఆవిరి తీసుకోవడం ప్రారంభించండి. ముక్కు దిబ్బడగా వున్నప్పుడు ఆవిరిని పీల్చుకోండి. రోజంతా గోరువెచ్చని నీరు త్రాగాలి. గొంతు నొప్పిగా వుంటే నీటిని పుక్కిలించండి.