సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (16:50 IST)

కోవిడ్ బారిన పడిన అనుపమ పరమేశ్వరన్?

Anupama Parameswaran
సౌత్ ఇండియన్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కార్తికేయ 2 సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్నో ప్రాంతాలలో పర్యటించిన అనుపమకు కరోనా సోకింది.
 
ఇటీవల జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్న అనుపమకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా సోకటంతో అనుపమ ఇంట్లోనే హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక అనుపమ సినిమాల విషయానికి వస్తే.. నిఖిల్‌కి జోడిగా అనుపమ నటించిన 18 పేజేస్‌ సినిమా ఏప్రిల్‌ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఇప్పటికే వీరిద్దరూ కలసి నటించిన కార్తీకేయ 2 సినిమా ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇక ఇప్పుడు వీరిద్దరూ మరొకరి జోడిగా 18 పేజేస్‌ సినిమాలో కనిపించనున్నారు.