శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 మే 2022 (13:24 IST)

ఒరిస్సాలో టొమాటో ఫ్లూ - 26 మంది చిన్నారులకు వైరస్

tomato flu
ప్రజలను కరోనా వైరస్, మంకీపాక్స్ వంటి వైరస్‌లు భయపెడుతున్నాయి. ఇపుడు టొమాటో ఫ్లూ కలకలం రేపుతోంది. ఒరిస్సా రాష్ట్రంలో 26 మంది చిన్నారులు ఈ వైరస్ బారినపడ్డారు. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్‌గా పిలిచే ఈ వైరస్ అనేక మంది చిన్నారులకు సోకింది. అయితే, వైద్యులు మాత్రం ఎలాంటి భయం అక్కర్లేదని అంటున్నారు. 
 
పేగు సంబంధింత వ్యాధి కారణంగానే ఈ వైరస్ సోకుతుందని, ముఖ్యంగా, చిన్నారులకు సోకుతుందని తెలిపారు. పెద్దవారిలో ఈ వైరస్‌ను తట్టుకునే రోగనిరోధక శక్తి ఉండటంతో వారికి పెద్దగా సోకదని వైద్యులు అంటున్నారు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల మేరకు ఈ వైరస్ సోకిన చిన్నారులకు జ్వరం, నోట్లో పుండ్లు, చేతులు, కాళ్లు, పిరుదులపై దుద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.