శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 11 మే 2022 (19:55 IST)

అసానీ తుఫాను హెచ్చరికలు: వినియోగదారులను సురక్షితంగా ఉండాలని ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ అప్రమత్తం

cyclone
తుఫాను హెచ్చరికల కేంద్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా రాష్ట్రాలపై అసానీ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండబోతుందన్న నేపథ్యంలో ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తమ వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. దక్షిణ అండమాన్‌ మరియు బంగాళాఖాతానికి ఆగ్నేయంలో సముద్రంలో అల్ప పీడనం తుఫానుగా తీవ్ర రూపం దాల్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు ఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్‌‌లలో ఈ వారంలో కురవనున్నాయి. రాష్ట్ర అధికారులు తమ విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేయడంతో పాటుగా వారిని పరిస్థితులకు తగినట్లుగా సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.
 
ఈ తరహా ప్రకృతి విపత్తుల వేళ, ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తమ వినియోగదారులందరినీ తమంతట తాము సురక్షితంగా ఉండాలని అభ్యర్థించడంతో పాటుగా తమ ప్రియమైన వారిని కూడా సురక్షితంగా ఉంచాల్సిందిగా కోరుతుంది.
 
వరదల వల్ల మీ వాహనాలు/ఇళ్లకు నష్టం జరగడాన్ని నివారించేందుకు:
 
మీ వాహనాలను సురక్షిత ప్రాంతంలో పార్క్‌ చేయాలి. నీటి మడుగులు చేరని ప్రదేశం కావడంతో పాటుగా వరదల ప్రభావానికి దూరంగా ఉండేలా జాగ్రత్త పడాలి.
 
వాహన కిటికీలు మూసివేయాలి
 
బ్యాటరీ కేబుల్స్‌ తొలగించాలి
 
నీరు చేరే ప్రాంతాలలో వాహనం నడపరాదు
 
ఒకవేళ తప్పనిసరి అయితే రోడ్డుపై భాగంలో వాహనం నడిపేందుకు ప్రయత్నించాలి
 
మొదటి గేర్‌లో మాత్రమే వాహనం నడపాలి, యాక్సలరేషన్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి
 
నీటినిల్వ ఉన్న ప్రాంతాల నుంచి బయటకు వచ్చే వరకూ మొదటి గేర్‌లోనే వాహనం నడిపించాలి
 
కారులో ఓ సుత్తి ఉంచుకుంటే, దురదృష్టవశాత్తు మీ కారు నీట మునిగినప్పుడు మీ కారు నుంచి మీరు బయటకు వచ్చేందుకు అద్దాలు పగలగొట్టడానికి తోడ్పడుతుంది.
 
ఒకవేళ మీ కారు నీట మునిగితే, కారు వదిలి బయటకు రావడంతో పాటుగా టాప్‌ ఎక్కాలి
 
ఒకవేళ మీ వాహనం నీట మునిగినా లేదంటే అదే ప్రాంతంలో ఆగిపోయినా వాహనం ప్రారంభించడానికి ప్రయత్నించవద్దు
 
వర్షం పడక ముందే మీ కారు రూఫ్‌ పరిశీలించండి. ఏవైనా వర్షం నీరు లోపలకు వస్తుంటే అది రాకుండా తగిన చర్యలు తీసుకోండి
 
కిటికీలు, తలుపులుపై ఫంగస్‌ లేదా తుప్పు పట్టడాన్ని నిరోధించండి. సంభావ్య బ్లాకేజ్‌లు లేదా లీకేజీలు ఏర్పడే చోట స్థానిక అధికారులను అప్రమత్తం చేయడం అవసరం
 
వర్షాకాలంలో విద్యుత్‌ షాక్‌లు తగిలే అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి అన్ని విద్యుత్‌ ఫిట్టింగ్స్‌ సరిగా ఉన్నాయో లేదో గమనించండి.
 
అన్ని నిత్యావసరాలు, అత్యవసరాలను నిల్వ చేసుకోండి, భారీ వర్షాలవల్ల వరదలు రావడంతో పాటుగా సాధారణ జీవితం అస్తవ్యస్తమయ్యే అవకాశాలున్నాయి. అందువల్ల బ్యాకప్‌ ఉంచుకోవాలి.
 
వీటితో పాటుగా వాహనాలకు తగిన భద్రతను అందించేందుకు, మీ ఇంటికి తగిన రక్షణ అందించేందుకు భీమా చేయించడం తప్పనిసరి. ప్రకృతి లేదా మానవ విపత్తుల వల్ల కలిగే నష్టాలకు ఇది కొంత సహాయపడుతుంది.
 
ఒకవేళ మీరు ఇప్పటికే ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఖాతాదారులు అయితే 1800 201 1111కు కాల్‌ చేసిన ఎడల తగిన సహాయం పొందగలరు.
 
ఒకవేళ పరిస్థితులు పూర్తిగా దిగజారితే, ఎస్‌బీఐ జనరల్‌ తమ వినియోగదారులకు తగిన సహాయం అందించేందుకు కట్టుబడింది. అంతేకాదు వారు తమ కాళ్లపై తాము నిలబడేందుకు తగిన సహాయం చేస్తుంది. వినియోగదారులు క్లెయిమ్‌ సంబంధిత సమాచారం పలు మార్గాలలో సమాచారం/నమోదు చేయడం చేయవచ్చు.
 
1. కంపెనీ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800 102 1111కు కాల్‌ చేయడం
 
2. <CLAIM> అని 561612కు ఎస్‌ఎంఎస్‌ చేయవచ్చు.
 
3. ఈ మెయిల్‌- [email protected] 
 
4. sbigeneral.inవెబ్‌సైట్‌లో క్లెయిమ్స్‌ విభాగం చూడవచ్చు
 
సెటిల్‌మెంట్‌  ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం లేకుండా ఉండేందుకు కంపెనీ పలువురు సర్వేయర్లను నియమించింది. ఒకవేళ వాణిజ్య క్లెయిమ్స్‌ అదీ 10 లక్షల రూపాయల లోపు ప్రభావితమైన వినియోగదారులకు ఎస్‌బీఐ జనరల్‌ ఎక్స్‌ప్రెస్‌ క్లెయిమ్స్‌ సెటిల్‌మెంట్‌ ప్రక్రియను అనుసరిస్తుంది. వరదలు, భారీ వర్షాల వల్ల వినియోగదారులు ఎదుర్కొనే సమస్యలు, నష్టాలను గుర్తించి ఎస్‌బీఐ జనరల్‌, ఎక్కడ వీలైతే అక్కడ పేపర్‌వర్క్‌ను రద్దు చేసింది. చిన్న క్లెయిమ్స్‌ అయితే తక్షణ సెటిల్‌మెంట్‌ను అందిస్తుంది. తద్వారా ఆ వ్యక్తులు త్వరగా కోలుకునేందుకు సహాయపడుతుంది.  విస్తృతస్ధాయి వ్యాపార కొనసాగింపు ప్రణాళిక, డిజిటల్‌ సంసిద్ధతలో పెట్టుబడులు పెడుతూ ఎస్‌బీఐ ఇప్పుడు ఈ తరహా వినియోగదారులకు మెరుగ్గా సహాయపడుతుంది.