1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మే 2022 (16:23 IST)

ఇకపై రాష్ట్రంలో పవర్ హాలిడేలు ఉండవు : మంత్రి పెద్దిరెడ్డి

peddireddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. దీంతో గృహాలతో పాటు వాణిజ్య, వ్యవసాయ రంగాలకు సరఫరా చేసే విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తున్నారు. కరెంట్ లేక సాధారణ జనం, రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. 
 
ఇకపై రాష్ట్రంలో పవర్ హాలిడేలు ఉండవని తెలిపారు. అలాగే, ఆయా కేటగిరీలకు చెందిన పరిశ్రమలకు విద్యుత్ వినియోగానికి సంబంధించిన పరిమితులను కూడా సడలిస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం తగ్గిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 180 మిలియన్ యూనిట్లుగా ఉందని, విద్యుత్ వినియోగం తగ్గిన నేపథ్యంలో పరిశ్రమలు మరింత మేర విద్యుత్‌ను అందించనున్నాయని తెలిపారు. 
 
అన్ని రకాల పరిశ్రమలకు 70 శాతం విద్యుత్ వినియోగం అనుమతిస్తున్నామని, ఫుడ్‌ప్రాసెసింగ్, కోల్డ్‌స్టోరేజీలకు 100 శాతం కరెంట్‌కు అనుమతి ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.