1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 మే 2022 (17:20 IST)

అసని తుఫాను.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. రానున్న 3 రోజులు?

cyclone
అసని తుఫాను ప్రభావంతో.. మంగళ, బుధ, గురువారంతో పాటు మూడు రోజులు తూర్పు గోదావరి, విజయవాడ, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళంలోనే గాక ఒడీశా లోని కోస్తా జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
అసని తుఫాను ప్రభావంతో గాలులు సుమారు గంటకు 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందంటున్నారు అధికారులు. సముద్ర తీరంలో ప్రస్తుతం కెరటాలు భారీగా ఎగిసి పడుతున్నాయి. కెరటాల ప్రభావానికి ఉప్పాడ తీర ప్రాంతం తీవ్రంగా కోతకు గురవుతోంది.
 
మరోవైపు ఈనెల 12వ తేదీ వరకు మత్స్యకారుల సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. విశాఖ,  విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.