ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 మే 2022 (12:53 IST)

LIC IPO : కీలక నిర్ణయాలు.. 98 శాతం సబ్‌స్క్రైబ్ ఓవర్

licipo
భారత్‌లోనే అతిపెద్ద ఐపీఓగా ఎల్ఐసీ రికార్డు సృష్టించడం ఇక లాంఛనమే. ఎల్ఐసీ ఐపీఓ కోసం చరిత్రలో ముందెన్నడూ లేనట్టుగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
 
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ప్రస్తుతం మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎల్ఐసీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ మే 4న ప్రారంభమైంది. మే 9న ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ముగుస్తుంది. ఇప్పటికే ఎల్ఐసీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.5,630 కోట్లు సేకరించడం విశేషం. 
 
ఎల్ఐసీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ స్టేటస్ చూస్తే రెండో రోజైన గురువారం బిడ్డింగ్ ముగిసే సమయానికి పాలసీ హోల్డర్ కోటా 2.92 రెట్లు, ఉద్యోగుల కోటా 2.08 రెట్లు, రీటైల్ కోటా 88 శాతం, క్యూఐబీ కోటా 40శాతం, ఎన్ఐఐ కోటా 45శాతం సబ్‌స్క్రైబ్ అయింది. మొత్తంగా చూస్తే ఎల్ఐసీ ఐపీఓ 98 శాతం సబ్‌స్క్రైబ్ కావడం విశేషం.
 
ఇక చరిత్రలో తొలిసారిగా ఎల్ఐసీ ఐపీఓ విజయవంతం చేసేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం విశేషం. ఐపీఓ కోసం వస్తున్న బిడ్డింగ్స్‌తో బ్యాంకింగ్ వ్యవస్థ సజావుగా సాగేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. 
 
సాధారణంగా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ శనివారం, ఆదివారం ఉండదు. శుక్రవారం సబ్‌స్క్రిప్షన్ ముగిస్తే మళ్లీ సోమవారం వరకు ఎదురుచూడాల్సిందే.