శనివారం, 2 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మే 2022 (15:19 IST)

మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసేది లేదు : ఆప్ఘన్ సర్కారు

afghanistan
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్ తీవ్రవాదులు ఇస్లాం చట్టాలను పక్కాగా అమలు చేస్తూ, ఆ చట్టాల మేరకు పరిపాలన సాగిస్తున్నారు. ఆ దేశ రాజధాని కాబూల్‌తో పాటు ఆ దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఆ దేశ ప్రజలు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆప్ఘన్ పాలకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పి, మహిళలకు డ్రైవింగ్ లైసెన్సుల జారీని నిలిపివేసింది. ఆప్ఘన్ రాజధాని కాబూల్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఆ దేశంలో ఆహారం పాటు నిత్యావర వస్తువుల కొరత ఏర్పడింది. దీంతో ఆప్ఘన్ పాలకులు ఈ తరహా కఠిన నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఆప్ఘనిస్థాన్ దేశం పూర్తిగా తాలిబన్లకు హస్తగతమైన తర్వాత మానవ హక్కులు పూర్తిగా మాయవుతాయని స్థానిక మీడియా పేర్కొంటుంది. ముఖ్యంగా, మహిళల విషయంలో మానవ హక్కులు పూర్తిగా నాశనమయ్యాయని మీడియా ఆరోపిస్తుంది.