శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 డిశెంబరు 2021 (08:36 IST)

వివాహానికి స్త్రీ అనుమతి తప్పనిసరి.. తాలిబన్లు సంచలనం

తాలిబన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. బలవంతపు పెళ్ళిళ్లపై తాలిబన్లు నిషేధం విధించారు. వివాహానికి స్త్రీ అనుమతి తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్జాతీయ ఒత్తిడి పెరగడంతో మహిళల విషయంలో తాలిబన్ ఉదార వైఖరిలో మార్పు వచ్చింది. మహిళలను అమ్ముకోవడం, అప్పు కింద చెల్లించడం.. సంధి కోసం పణంగా పెట్టడం వంటివి సంప్రదాయంగా చలామణి అవుతున్నాయి.
 
గిరిజన తెగల్లో వితంతువులైన మహిళలు.. భర్త అన్నదమ్ముల్లోనే ఒకరిని తిరిగి వివాహం చేసుకోవాలనే నియమం వుంది. ఇలాంటి ఆచారన్నింటినీ మార్చేలా తాలిబన్లు తాజాగా ఉత్తర్వులను ఆదేశించింది. వివాహానికి స్త్రీ అనుమతి అవసరమని.. పురుషులు, మహిళలు సమానమని ఉత్తర్వుల్లో తాలిబన్లు తెలిపారు. స్త్రీలను ఆస్తిగా పరిగణించకూడదని తాలిబన్లు పేర్కొన్నారు.