శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (10:59 IST)

మహిళలపై గ్యాంగ్‌ దాడి.. కడుపు తన్నుతూ.. ఎక్కడ?

ఢిల్లీలో  నిర్భయ లాంటి ఘటనలు చోటుచేసుకున్నా... కఠినమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై దాడులు ఆగట్లేదు. తాజాగా మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని.. షాలిమార్‌బాగ్‌లో ముగ్గురు మహిళలపై ఓ గ్యాంగ్‌ దాడి చేసింది. 
 
కర్రలతో ఆ మహిళలపై దాడులు చేశారు. కడుపును తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన నవంబర్ 19వ తేదీన చోటుచేసుకుంది. 
 
ఈ దాడిలో గాయపడిన ఓ మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన.. వీడియోను పోలీసులు విడుదల చేశారు. 
 
కారు దిగిన ఆ ముగ్గురు మహిళలను… ఓ గ్యాంగ్‌ దారుణంగా కొట్టడం మనకు కనిపించింది. ప్రస్తుతం ఆ ముఠా కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.