సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (11:12 IST)

గెడ్డం ఉంటేనే ఆఫీసులకు రండి.. లేకుంటే రావొద్దు!!

ఆప్ఘనిస్థాన్ దేశం తాలిబన్ల హస్తగతమైంది. అప్పటి నుంచి తాలిబన్ సంప్రదాయాలు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే పురుషులు విధిగా గడ్డంతోనే రావాలని, గడ్డం లేకుండా రావొద్దంటూ హుకుం జారీచేశారు. కాబూల్‌లోని ప్రభుత్వ కార్యాలయాలను తాలిబన్ తీవ్రవాదులు ఆకస్మికంగా తనిఖీలు చేసి ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. 
 
ఇక నుంచి ఏ ఒక్క పురుషుడు గడ్డు గీసుకోరాదనీ, సంప్రదాయ దుస్తులనే ధరించాలని సూచించారు. ఒకవేళ గడ్డం లేకుండా ఉద్యోగాలకు వచ్చే పురుష ఉద్యోగులను తొలగించే విషయంలో ఏమాత్రం జాప్యం చేయొద్దని హెచ్చరించారు. 
 
రాజధాని కాబూల్‌లోని పలు ప్రభుత్వ కార్యాలయాలను తాలిబన్ ప్రభుత్వంలోని పబ్లిక్ మొరాలిటీ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు సోమవారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు డ్రెస్ కోడ్‌ తప్పనిసరి అని ప్రకటించారు. గడ్డం గీసుకోవద్దని చెప్పిన అధికారులు సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలని సూచించారు.