మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మే 2022 (19:40 IST)

4 రాష్ట్రాల్లో పేలుళ్ళకు ప్లాన్ - భారీగా పేలుడు పదార్థాలతో నలుగురి అరెస్టు

terrorists
తెలంగాణ రాష్ట్రంతో సహా నాలుగు రాష్ట్రాల్లో భారీ పేలుళ్ళకు కుట్ర పన్నిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఉగ్రవాదులు ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. 
 
హర్యానా రాష్ట్రంలోని టోల్ ప్లాజ్ వద్ద అనుమానిత కారులో తనిఖీలు చేయగా, అందులో భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో థర్టీ కాలిబర్ పిస్టళ్లు, ఐఈడీలు, ఆర్డీఎక్స్ తదితర వస్తువులు ఉన్నాయి. 
 
కారులోని నలుగురు ఖలిస్థాన్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ, పంజాబ్, హర్యానా పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. అరెస్టు చేసిన ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ ఆయుధాలను మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు గుర్తించారు.