1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మే 2022 (22:35 IST)

శ్రీకాకుళం జిల్లాలో కొట్టుకొచ్చిన బంగారు మందిరం

Andhra coast
Andhra coast
శ్రీకాకుళం జిల్లాలో వింత చోటుచేసుకుంది. అసని తుఫాను ప్రభావంతో ఇతర దేశానికి చెందిన ఓ బంగారు మందిరం సున్నాపల్లి రేవుకు కొట్టుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన రథంగా దీనిని భావిస్తున్నారు.
 
అసాని తుపాన్ ప్రభావంతో ఇది సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. అక్కడి ప్రజలు వీక్షించేందుకు ఎగబడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లి సముద్రం రేవుకు ఎప్పుడూ చూడని వింతైన రథం మంగళవారం కొట్టుకు వచ్చింది. 
 
ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో లిఖించి వుంది. ఇది మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది మత్స్యకారులు అంటున్నారు. 
 
ఇకపోతే.. తీవ్రతుఫాను నుంచి తుఫానుగా బలహీనపడింది అసని. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం వుందంటోంది వాతావరణ శాఖ.