గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (18:36 IST)

కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలచివేసింది : ప్రధాని నరేంద్ర మోడీ

krishnamraju - modi
టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"యు.వి.కృష్ణంరాజు గారి మరణం నన్ను కలచివేసింది. రాబోయే రతరాలు ఆయన నటనా కౌశలాన్ని, సృజనాత్మకను స్మరించుకుంటూ ఉంటాయి. సమాజసేవలో కూడా ఆయన ముందంజలో ఉండి రాజకీయ నాయకుడుగా తనదైన ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి" అని పేర్కొన్నారు. 
 
అలాగే, ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తన సంతాపాన్ని తెలిపారు. "కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. కృష్ణంరాజు గారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ ఆయన కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా" అని పేర్కొన్నారు.