మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (15:19 IST)

ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

PM Modi
PM Modi
పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో, భారతీయుల శ్రమ, మేధస్సుతో రూపుదిద్దుకున్న తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. రక్షణ రంగంలో ఎన్నో ఘనతలు సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారత్.. ఇవాళ మరో మైలురాయిని అందుకుంది. 
 
రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారత జోరుకు ఐఎన్ఎస్ విక్రాంత్ సరైన ఉదాహరణ అని మోదీ కొనియాడారు. దీంతో పాటు నౌకా దళానికి సరికొత్త గుర్తును కూడా ఆవిష్కరించారు. 
Vikas
Vikas
 
వలస పాలన బానిసత్వానికి గుర్తుగా నిలిచిన సెయింట్ జార్జి క్రాస్ తొలగించి, ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తితో నూతన పతకాన్ని రూపొందించారు. నూతన పతాకంలో ఎడమవైపు భాగంలో జాతీయ పతాకం వుంది. 
 
కుడివైపు అష్ట భుజులు రెండు ఉన్నాయి. వాటి మధ్య ఓ లంగరుపై భారత జాతీయ చిహ్నం వుంది. ఈ లంగరు క్రింత "సం నో వరుణః" అనే నినాదం వుంది. దీనిని వేదాల నుంచి స్వీకరించారు. 
Vikas
Vikas
 
ఈ కార్యక్రమంలో భాగంగా నావికా దళం కోసం కొత్తగా రూపొందించిన పతకాన్ని మోదీ ఎగురవేశారు. ఇప్పటివరకు నౌకాదళానికి బానిస గతాన్ని గుర్తుచేసే చిహ్నం వుండేది. 
 
ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ స్ఫూర్తితో కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించుకున్నాం. దేశ బానిసత్వ గతాన్ని ఇది చెరిపేస్తుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. 
vikas
vikas