బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (19:53 IST)

2024 ట్వంటీ-20 ప్రపంచ కప్.. కొత్త ఫార్మాట్ రెడీ

World cup
World cup
2024 ట్వంటీ-20 ప్రపంచ కప్ సిరీస్ కోసం ఐసీసీ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. తదుపరి ప్రపంచకప్ క్రికెట్ సిరీస్ వెస్టిండీస్‌లో జరగనుండడంతో ఈ సిరీస్‌లో జట్ల సంఖ్యను పెంచాలని ఐసీసీ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రపంచ క్రికెట్ పోటీల్లో టీ20 సిరీస్‌కు ఆదరణ ఉంది. 
 
అంతేకాదు టీ20 ప్రపంచకప్‌పై ఉత్కంఠ ఇంకా తగ్గలేదు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ క్రికెట్ సిరీస్‌లో పాకిస్థాన్‌ను ఓడించి ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. ఇక తదుపరి ప్రపంచ కప్ 2024 జూన్‌లో జరుగనుంది. ఈ టోర్నీలో ఈసారి 20 జట్లు తలపడబోతున్నాయి.
 
వీటిని నాలుగు గ్రూపులుగా, గ్రూప్‌కు ఐదు జట్లుగా విభజిస్తారు. ప్రతి గ్రూపు నుంచి టాప్-2లో నిలిచిన రెండు జట్ల చొప్పున, మొత్తం ఎనిమిది జట్లను ఎంపిక చేసి సూపర్-8 ఫేజ్ నిర్వహిస్తారు.
 
ఇక ఇటీవలి టోర్నీలో రాణించిన అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు కూడా బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. దీంతో మొత్తం 12 జట్లు టోర్నీకి అర్హత సాధించాయి. మిగతా ఎనిమిది జట్లను ఎంపిక చేయాల్సి ఉంది.