మర్రి శశిథర్ రెడ్డి కాషాయ తీర్థం ఖాయం : ఢిల్లీ షాతో భేటీ
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారడం ఖాయమని తేలిపోయింది. ఆయన శనివారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఆయనతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. దీంతో తనకు తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని మర్రి శశిధర్ రెడ్డి వీడటం ఖాయమని తేలిపోయింది.
ఢిల్లీలో హోం మంత్రిని కలిసివారిలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌లతో పాటు మరికొందరు ఉన్నారు. ఈ భేటీ తర్వాత శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని తేలిపోయింది.
కాగా, గత కొంతకాలంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మర్రి శశిథర్ రెడ్డి విమర్శనాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తీరు ఏమాత్రం బాగోలేదని, మునుగోడు ఉప ఎన్నికలను ఆయన లైట్‌గా తీసుకున్నారని, పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బయటకువెళ్లినా దానికి బాధ్యడు రేవంత్ రెడ్డేనంటూ మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.