బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 నవంబరు 2022 (18:12 IST)

టీ కాంగ్రెస్‌కు భారీ షాక్ - బీజేపీలో చేరనున్న మర్రి శశిధర్ రెడ్డి

Marri Shashidhar Reddy
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీని పటిష్టం చేసేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానం ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ అవేమీ ఫలించడం లేదు. ఆ పార్టీకి చెందిన ఒక్కో సీనియర్ నేత జారుకుంటున్నారు. 
 
తాజాగా సీనియర్ నేతగా ఉన్న మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమైపోయారు. ఆయన బుధవారం ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకోసం ఆయన తన అనుచరులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. 
 
ఆయన వెంటే బీజేపీ మహిళానేత డీకే అరుణ కూడా ఉన్నారు. నిజానికి మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్తలను నిజం చేస్తూ ఇపుడు బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమైపోయారు.