శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (09:02 IST)

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు షాక్ : టీడీపీలో చేరిన ప్రధాన అనుచరుడు

nara lokesh
మంగళగిరిలో నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనుచరుడైన గొర్లె వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో ఆర్కే విజయంలో ఈయన కీలక భూమికను పోషించారు. ఇపుడు వైకాపాకు రాజీనామా చేసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 
 
స్థానిక మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో లోకేశ్ సమక్షంలో వేణుగోపాల్ రెడ్డి పసుపు కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిచారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి తాడేపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. 
 
వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరడంపై లోకేశ్ స్పందిస్తూ, వైకాపాలో ఆత్మగౌరవలం లేకే చాలా మంది పార్టీని వీడి బయటకు వస్తున్నారని చెప్పారు. గంజాయి మత్తులో తాడేపల్లే మండలం మొత్తం నాశనమైందని ఆరోపించారు.