Akhanda 2: అఖండ 2 క్రిస్ మస్ కు తాండవం చేస్తుందా ? దామోదర ప్రసాద్ ఏమన్నారంటే..
నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ 2 తాండవం ఎప్పుడు చేస్తున్నదో ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిగో అదిగో అంటూ వార్తలు వస్తున్నా ఇంకా ఫైనాన్స్ విషయాలు పూర్తిగా క్లియర్ కాలేదని తెలుస్తోంది. డిసెంబర్ 12 న రిలేజ్ చేద్దాం అంటే అప్పటికీ ముందుగా చిన్న సినిమాలు ధియేటర్ లను ఆయా నిర్మాతలు బ్లాక్ చేశారు. అఖండ 2 విడుదల గురించి నిన్న డి. సురేష్ బాబు ప్రయత్నాలు చేస్తున్నల్టు చెప్పారు.
కాగా, నేడు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి గా అనుభం ఉన్న నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ తన సినిమా ప్రమోషన్ లో అఖండ 2 తాండవం తన అభిప్రాయాన్ని తెలిపారు. విలేకరులు అడుగగా, సినిమా అనేది బిజినెస్. దాన్ని జాగ్రతగా నిర్మాతలు చేసుకోవాలి. ఇందులో ఎవరిదీ తప్పు అనేది చూడకూడదు. గతంలో ఇలా సినిమాలు ఆగిపోవడం సహజమే. కాని పెద్ద హీరో సినిమా కు ఇలా జరగడం భాధాకరం. నేను తీసిన ఇషా సినిమాను డిసెంబర్ 24 న రిలీజ్ అనుకున్నాం. కాని పరిస్థితుల వల్ల డిసెంబర్ 12 కు వచ్చాం. అలాగే మిగిలిన కొన్ని సినిమాలు ఉన్నాయి.
అందుకే డిసెంబర్ 24 న రిలేజ్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం. అప్పటికి సాఫ్ట్ వేర్ ఉద్త్యోగులకు సెలవులు. పిల్లలకు హాలిడేస్. ఓవర్ సీస్ లో కూడా ఫ్రీగా ఉంటారు. అప్పటినుంచి సంక్రాంతి వరకు కలిసి వస్తున్నది.. మరి నిర్మాతలు ఎ నిర్ణయం తెసుకుంటారో చూడాలి అని అన్నారు.