సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2022 (22:45 IST)

ఆప్ఘన్ బౌలర్లను శతక్కొట్టిన విరాట్ కోహ్లీ.. నిప్పులు చెరిగిన భువనేశ్వర్

virat kohli
ఆసియా కప్ టోర్నీలో భాగాంగా నామమాత్రపు మ్యాచ్‌‍లో భారత ఆటగాళ్లు సింహాల్లా రెచ్చిపోయారు. తొలుత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకంతో వీర విహారం చేశాడు. ఆ తర్వాత బౌలర్ భువనేశ్వర్ కుమార్ బంతితో నిప్పులు చెరిగాడు. ఫలితంగా ఆప్ఘన్ జట్టు చిత్తుగా ఓడిపోయింతి. నిజానికి ఈ టోర్నీలో ఆప్ఘన్ జట్టు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పోయిస్తూ వచ్చింది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టును ఓడించినంత పని చేసింది.
 
అయితే, గురువారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఆప్ఘన్ జట్టు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంద. ఫలితంగా ఈ టోర్నీలోనే తామాడిన మ్యాచ్‌ల్లో అత్యంత చెత్తదైన ఆటతీరుతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆప్ఘన్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో ఓపెనర్లుగా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. వీరిద్దరూ క్రీజ్‌లో చెలరేగిపోయారు. 
 
ఫలితంగా తొలి వికెట్‌కు ఏకంగా 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో రాహుల్ 41 బంతుల్లో రెండు సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 62 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికి సిక్సర్ బాది రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత రిషభ్ పంత్ 16 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. 
 
మరో ఎండ్‌లో పాతుకుపోయిన విరాట్ కోహ్లీ బ్యాట్‌తో రెచ్చిపోయాడు. 61 బంతుల్లో ఆరు సిక్సర్లు, 12 ఫోర్ల సాయంతో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా కోహ్లీ ఓవరాల్‌గా 71వ అంతర్జాతీయ సెంచరీ కొట్టాడు. అలాగే, నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగుల భారీ స్కోరు చేసింది. 
 
అత్యధిక సెంచరీల జాబితాలో సచిన్ వంద సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా, 71 సెంచరీలతో రికీ పాంటింగ్ ఉన్నాడు. ఇపుడు ఈ ఫీట్‌ను కోహ్లీ అందుకున్నాడు. ముఖ్యంగా, టీ20లో కోహ్లీకి ఇది తొలి సెంచరీ కావడం గమనార్హం. పైగా, భారత్ తరపున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్‌మెన్‌‍గా రికార్డుపుటలకెక్కాడు. 
 
ఆ తర్వాత 214 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘన్ జట్టును ఓపెనింగ్ బౌలర్ భువనేశ్వర్ ఆదిలోనే కోలుకోకుండా దెబ్బతీశాడు. కేవలం 9 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ నాలుగు వికెట్లూ భువనేశ్వర్ ఖాతాలోనే చేరాయి. ఆ తర్వాత అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తీయగా, భువనేశ్వర్ మరో వికెట్ పడగొట్టాడు.

ఆ తర్వాత అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తీయగా, భువనేశ్వర్ మరో వికెట్ పడగొట్టాడు. ఓవరాల్‌గా నాలుగు ఓవర్లు వేసిన భువనేశ్వర్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. నాలుగు ఓవర్లలో ఒక ఓవర్ మేడ్ ఇన్ కావడం గమనార్హం. 7.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన ఆప్ఘన్ 25 పరుగుుల మాత్రమే చేసింది.

చివరకు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 111 పరుగులుచేసింది. ఆ జట్టులో ఇబ్రహీం జద్రాన్ అత్యధికంగా 64 పరుగులు చేశాడు. మొత్తం 59 బంతులను ఎదుర్కొన్న జద్రాన్ 2 ఫోర్లు, 4 ఫోర్ల సాయంతో ఈ పరుగులు చేశాడు. ఆ తర్వాత ముజ్బీర్ రెహ్మన్ 18, రషీద్ ఖాన్ 15 మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. భారత బౌలర్లో భువనేశ్వర్ 5, అశ్విన్, హూడా, అర్ష్‌దీప్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు.