సంబంధిత వార్తలు
- Happy Teachers’ Day 2022: 21 ఏళ్లకే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ లెక్చరర్.. ఎవరాయన?
- ధోనీ అభిమానులకు శుభవార్త - 2023లో కెప్టెన్‌గా బరిలోకి...
- కోహ్లీ పాత్రను నేను తప్ప ఎవరూ చేయలేరు... రౌడీ హీరో (video)
- ఆసియా కప్ : కోహ్లీ - సూర్య అర్థ సెంచరీలు - హాంకాంగ్ టార్గెట్ 193 రన్స్
- దుబాయ్ చేరిన టీమిండియా - పాక్ కెప్టెన్‌తో కోహ్లీ కరచాలనం!
ఆ సమయంలో ఒక్క ధోనీ నుంచే సందేశం వచ్చింది : విరాట్ కోహ్లీ
తాను కెప్టెన్సీని వదిలివేసినపుడు ధోనీ ఒక్కడే వ్యక్తిగతంగా అండగా నిలిచాడని భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. పైగా, టీవీల ముందు కూర్చొని ప్రపంచం మొత్తం తెలిసేలా ఇచ్చే సలహాలకు తాను విలువ ఇవ్వబోనని స్పష్టం చేశాడు. ఆసియా కప్ టోర్నీలో మళ్లీ గాడినపడిన విరాట్ కోహ్లీ ఆదివారం పాకిస్థాన్ జట్టు జరిగిన కీలక మ్యాచ్‌లో 60 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత ఓడిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ విలేకరుల సమావేశంలో అనేక విషయాలు వెల్లడించారు.
తాను టెస్ట్ కెప్టెన్సీ వదిలి వేసినపుడు ఒకే ఒక్క వ్యక్తి నుంచి నాకు మెసేజ్ వచ్చింది. గతంలో ఆ వ్యక్తితో కలిసి నేను ఆడాను. ఆ వ్యక్తి ఎమ్మెస్ ధోనీ. మరెవరూ నాకు మెసేజ్‌లు చేయలేదు. నా ఫోన్ నంబరు అనేక మంది వుంది. కానీ, చాలా మంది టీవీల్లో సలహాలు ఇస్తుంటారు. ధోనీ ఒక్కడే నాకు వ్యక్తిగతంగా మెసేజ్ ఇచ్చాడు.
మీకు ఎవరితోనైనా నిజాయితీతో కూడిన సబంంధాలు ఉంటే మీకు ఇరువైపుల నుంచి నమ్మకం ఉందన్న విషయం అర్థమవుతుంది. నేను అతడిని నుంచి ఏమీ ఆశించలేదు. అతను నా నుంచి ఏమీ ఆశించలేదు. మేము ఇద్దరం పరస్పరం అభద్రతా భావంత ఎపుడూ లేము" అని చెప్పుకొచ్చారు.
అలాగే, పలువురు మాజీలు బహిరంగంగా సలహాలు ఇవ్వడంపై ఆయన స్పందిస్తూ, నేను ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే వ్యక్తిగతంగా చెబుతాను. మీరు టీవీల ముందు కూర్చొని ప్రపంచం మొత్తం తెలిసేలా నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే వాటికి నేను విలువ ఇవ్వను. మీరు నాతో వ్యక్తిగతంగా మాట్లాడొచ్చు. వాటిని నేను నిజాయితీగా పరిశీలిస్తాను. అవి ఎలా ఉంటాయో మీరే చూస్తారు. దేవుడు అన్నీ ఇచ్చినపుడు మీరు విజయం సాధించేలా ఆ భగవంతుడే చూస్తాడు. అన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి" అని అన్నారు.
