గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2022 (22:31 IST)

కోహ్లీ పాత్రను నేను తప్ప ఎవరూ చేయలేరు... రౌడీ హీరో (video)

Vijay Devarakonda, Ananya Pandey,
లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'జనగణమన', శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి 'ఖుషి' సినిమా చేస్తున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే తాను విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటిస్తానని చెప్పాడు. 
 
ఇప్పటికే ధోనీ బయోపిక్‌ను సుశాంత్ రాజ్ పుత్‌తో తీశారని, అందువల్ల కోహ్లీ బయోపిక్‌లో నటించాలనుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు. కోహ్లీ పాత్రను తాను తప్ప ఎవరూ చేయలేరని ఈ రౌడీ హీరో అంటున్నాడు. 
 
మరోవైపు ఆసియా కప్‌లో భాగంగా విజయ్ దేవరకొండ భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ కోసం క్రికెట్ మైదానంలో యాంకర్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. విజయ్, ఇర్ఫాన్ బస్సులో ఉన్న ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. విజయ్ తన సినిమా లైగర్ ప్రమోషన్‌లో భాగంగా ఆసియా కప్‌లో పాల్గొన్నాడు.