గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (16:21 IST)

"లైగర్" నుంచి రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్

liger still
విజయ్ దేవరకొండ, అనన్యపాండే జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "లైగర్". ఈ చిత్రం ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. విడుదలైన తొలి ఆట నుంచి నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజున రికార్డు స్థాయిలో రూ.35 కోట్ల మేరకు వసూలు చేసింది. 
 
ఆ మరుసటి రోజు నుంచి ఈ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో నష్టాల నుంచి గట్టెక్కేందుకు వీలుగా ఈ మూవీలోని పాటలను వీడియో సాంగ్‌ల రూపంలో విడుదలే చేస్తున్నారు. ఇందులోభాగంగా, మంగళవారం రొమాంటిక్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. 
 
"కలలో కూడా" అంటూ సాగే మెలోడియన్ సాంగ్ వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో అనన్య, విజయ్ కెమిస్ట్రీ బాగా పండింది. తనిషఅ బాగ్చీ స్వరపరిచిన ఈ పాటను భాస్కర భట్ల గేయరచన చేశారు. సిధ్ శ్రీరామ్ ఆలచింపారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.