సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (16:43 IST)

"లైగర్‌''కు షాకిచ్చిన సెన్సార్ బోర్డు - 'ఎఫ్' వర్డ్ సీన్లకు కత్తెర

Liger making
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన "లైగర్" చిత్రం ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టు సమాచారం. 
 
ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఒకటి, రెండు కాదు ఏకంగా ఏడు చోట్ల కత్తెర వేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో అనేక అభ్యంతర సన్నివేశాలు ఉన్నాయని, వాటిని పూర్తిగా తొలగించాలంటూ సెన్సార్ బోర్డు సభ్యులు జట్టుకు తెలిపారు. సాధారణంగా విజయ్ దేవరకొండ చిత్రంలో అధికంగా బోల్డ్ డైలాగులు ఉంటాయి. 
 
ఇక 'ఊరమాస్' డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తోడయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పైగా, ఇందులో ఎఫ్ వర్డ్ సన్నివేశాలు అధికంగానే ఉన్నాయని, వీటన్నింటినీ తొలగించాల్సిందేనంటూ సెన్సార్ బోర్డు సభ్యులు తేల్చి చెప్పారు.