సోమవారం, 26 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 జనవరి 2026 (20:15 IST)

ట్రెండ్ అవుతున్న ఒంటరి పెంగ్విన్.. ఓపికకు సలాం కొడుతున్న నెటిజన్లు (videos)

Penguin
Penguin
2007లో వెర్నర్ హెర్జోగ్ తీసిన ఒక డాక్యుమెంటరీలోని చిన్న బిట్ ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. సాధారణంగా పెంగ్విన్లు గుంపులుగా సముద్రం వైపు వెళ్తాయి. కానీ ఈ వీడియోలో ఒక పెంగ్విన్ మాత్రం తన గుంపును వదిలేసి, మృత్యువు పొంచి ఉందని తెలిసినా ఆకాశాన్ని తాకే మంచు పర్వతాల వైపు వెళ్తుంటుంది. దాన్ని వెనక్కి తెచ్చే ప్రయత్నం చేసినా అది మళ్లీ పర్వతాల వైపుకే దారి తీస్తుంది. 
 
ఈ దృశ్యం చూస్తుంటే ఆ పెంగ్విన్‌కు జీవితంపై విరక్తి కలిగిందా? లేక దానికి పిచ్చి పట్టిందా? అనే అనుమానం కలుగుతుంది. ప్రస్తుత కాలంలో మనుషులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఒంటరితనం, ఏమీ లేని శూన్యం అనే భావనలకు ఈ పెంగ్విన్ ఒక గుర్తుగా మారింది. మేమంతా ఆ పెంగ్విన్ లాంటి వాళ్లమే.. ఎటో తెలియని ప్రయాణం చేస్తున్నాం.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఇన్‌స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. మరోవైపు పెంగ్విన్ ఓపికకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంటార్కిటికా మంచు ప్రాంతంలో పర్యాటకులు దారి అడ్డంగా ఉండటంతో ఓ పెంగ్విన్ ఎంతో ఓపికగా వారు తప్పుకుంటారని ఎదురుచూసింది. వారు దారి ఇవ్వగానే మర్యాదగా అది ముందుకు సాగింది. ఈ వీడియో కాస్త ముందుకు సాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.