ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (11:07 IST)

బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్‌పై కేసు నమోదు

బాలీవుడ్ నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ కేసు నమోదైంది. తన సినిమాల్లో మైనర్ పిల్లలపై అభ్యంతకర సన్నివేశాలను తెరకెక్కించారనే ఆరోపణలతో ముంబై మహిమ్ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమాలోని కొన్ని సీన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త సీమ దేశ్‌పాండే ముంబై సెషన్స్ కోర్టు పిటిషన్ కూడా దాఖలు చేసింది. 
 
ఇందులో నటించిన పిల్లలంతా మైనర్లని, అలాంటి వారితో అభ్యంతకర దృశ్యాలను చిత్రీకరించడం ఫోక్సో చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆమె పిటిషన్‌లో ఆరోపించారు. సీమ దేశ్‌పాండే ఫిర్యాదు మేరకు మహేశ్ మంజ్రేకర్ ఐసీసీ 292, 34 సెక్షన్లలో పాటు ఫోక్స సెక్షన్ 15, ఐటీ యాక్ట్ 67, 67బీ కింద కేసు నమోదు చేస్తారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తామన్నారు.