శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (17:08 IST)

హిందూ దేవతలపై పోస్టులు.. ట్విట్టర్‌పై హైకోర్టు ఫైర్

కాళికా దేవి సహా ఇతరు హిందూ దేవతలపై అభ్యంతరకరమైన పోస్టులను పెట్టిన "ఎథిస్ట్‌రిపబ్లిక్" ట్విట్టర్ ఖాతాను నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ నవీన్ చావ్లాల ధర్మాసనం.. ట్విట్టర్ చర్యలపై అసహనం వ్యక్తం చేసింది.
 
అయితే, కోర్టు ఉత్తర్వుల్లేకుండా ఆ ఖాతాలను నిలిపివేసే అధికారం మాకు లేదని ట్విట్టర్ వివరించింది. ఈ వివరణపై హైకోర్టు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తూ.. కేంద్రం ఐటీ మార్గదర్శకాల ఫ్రేమ్‌వర్క్‌ను తప్పనిసరిగా అనుసరించాలని సూచించింది. ట్విట్టర్, కేంద్రం సహా ఎథిస్ట్‌రిపబ్లిక్ ఖాతా నిర్వాహకులకు నోటీసులు జారీచేసింది.
 
అంతిమంగా వివాదాన్ని పెంచడమే తప్పా వేరే మతానికి సంబంధించి ఇలాంటివి జరిగితే, మీరు చాలా జాగ్రత్తగా, మరింత సున్నితంగా ఉంటారని మేము ధైర్యంగా చెప్పగలమని మండిపడింది. కోర్టు ఉత్తర్వుల్లేకుండా బ్లాక్ చేయలేమంటున్నారు సరే, ట్రంప్ విషయంలో ఏ కోర్టు ఆదేశాలిచ్చిందో తెలియజేయాలని నిలదీసింది. 
 
అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేసే ఖాతాదారులను బ్లాక్ చేయడం పట్ల మీ విధానాన్ని తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు అడిగింది.