బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (11:17 IST)

వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం : నేడు రూ.29.51 కోట్ల నిధుల జమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్ల నిధులను జమ చేసింది. ఈ నిధులను మంగళవారం సీఎం జగన్ బటన్ నొక్కి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఈ నిధులను జమ చేయడం జరిగింది. 
 
నేడు రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సీడీ 
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సీడీని మంగళవారం జమ చేసింది. గత 2021 నవంబరు నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఈ ఇన్‌పుట్ సబ్సీడీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే. దీంతో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జమ చేశారు.  
 
మంగళవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదును జమ చేశారు. 5,71,478 మంది రైతుల ఖాతాల్లోకి రూ.543.77 కోట్లను, అలాగే, 1220 రైతు గ్రూపులకు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లను అందజేశారు. ఈ రెండు పథకాలకు మొత్తం రూ.564.28 కోట్లను జమచేశారు.