గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

"లైగర్" నా పాత్రలో లోపం ఉంది: విజయ్ దేవరకొండ

liger
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం "లైగర్". ఈ నెల 25వ తేదీన రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ తొలిసారి హిందీలో నటించిన చిత్రం. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శనివారం చిత్రం బృందం చెన్నైలో సందడి చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ పాల్గని మాట్లాడుతూ, ఈ చిత్రంలో నా పాత్ర నత్తితో ఉంటుంది. దర్శకుడే ఉద్దేశ్యపూర్వకంగా పెట్టాడు. ఈ చిత్రంలో నటించేందుకు చాలా శ్రమించాను. చిత్రం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందన్నారు. అదేసమయంలో ఓ ఫైట్ సన్నివేశంలో మైక్ టైసన్ కొట్టిన దెబ్బకు రోజంతా నొప్పితో బాధపడినట్టు చెప్పారు. 
 
ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ, సినిమాకు సంబంధించి కొన్ని అనుభవాలను పంచుకున్నారు. ఈ సినిమాలో తన పాత్ర నత్తితో ఉంటుందని చెప్పాడు. ఈ పాత్రను చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నాడు. సినిమా ఎంతో ఆసక్తికరంగా ఉంటుందన్నాడు. 
 
సినిమా షూటింగ్ సందర్భంగా మైక్ టైసన్ చెంపపై కొట్టిన దెబ్బకు ఒక రోజంతా నొప్పితో బాధపడినట్టు విజయ్ దేవరకొండ చెప్పాడు. బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్‌తో నటించడానికి ముందు కొంత ఆందోళన చెందినట్టు తెలిపాడు. 
 
రమ్యకృష్ణ గొప్పగా నటించినట్టు పేర్కొన్నాడు. 'లైగర్' చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సింగ్ క్రీడాకారుడి పాత్రలో కనిపించనున్నాడన్న సంగతి తెలిసిందే.