గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2022 (11:05 IST)

విజయ్ దేవరకొండతో ప్రేమ.. రష్మిక ఏం చెప్పిందో తెలుసా?

Rashmika Mandanna
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమాయణంపై రష్మిక మందన స్పందించింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై విజయ్‌ దేవరకొండ, రష్మిక ఇద్దరూ వివరణ ఇచ్చారు. తమ మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని, ఆ రూమర్స్‌లో నిజం లేదని స్పష్టం చేశారు. అయినా వీరి గురించి ఏదో విధంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. దీంతో నటి రష్మిక ఇటీవలే ఒక భేటీలో తానిప్పటికీ సింగిలే అని తెలిపింది. 
 
అయితే టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నా, బాలీవుడ్‌కు ఎగబాకినా, కోలీవుడ్‌లో మాత్రం సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తూనే ఉంది. కార్తీకి జంటగా సుల్తాన్‌ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చినా, ఆ చిత్రంతో ఆశించిన క్రేజ్‌ను తెచ్చుకోలేక పోయింది. దీంతో తాజాగా విజయ్‌తో రొమాన్స్‌ చేస్తున్న వారీసు చిత్రం పైనే రష్మిక భారీ ఆశలే పెట్టుకుంది. ఇక పుష్ప-2లోనూ ఆమె నటిస్తోన్న సంగతి తెలిసిందే.