మంగళవారం, 12 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 2 ఆగస్టు 2022 (16:26 IST)

అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ భార్యను ఒత్తిడి చేసాడని ముక్కు-చెవులు-మర్మాంగం కోసేసాడు

knife
తను ఇంట్లో లేని సమయంలో ఓ పోలీసు ఇంట్లోకి ప్రవేశించి తన భార్యను లైంగిక కోర్కె తీర్చమంటూ ఒత్తిడి చేసాడని సదరు భర్త గట్టిగా షాక్ ఇచ్చాడు. తన కోర్కె తీర్చాలని పట్టుబట్టడమే కాకుండా అక్రమ సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్న పోలీసు ముక్కు-చెవులు-మర్మాంగం కోసేసాడు.

 
పూర్తి వివరాలు చూస్తే... పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులో మహ్మద్ ఇఫ్తికార్ తన భార్యతో కలిసి వుంటున్నాడు. ఈ క్రమంలో అతడి భార్యపై కన్నేసాడు ఓ పోలీసు. దాంతో భర్త బయటకు వెళ్లగానే ఇంట్లోకి ప్రవేశించి అతడి భార్యను లైంగిక వేధింపులకు గురి చేసాడు. అంతేకాకుండా... తన కోర్కె తీర్చికపోయినా, అక్రమ సంబంధం పెట్టుకోనట్లయితే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించాడు. ఈ విషయాన్ని ఇంటికి వచ్చిన భర్తతో చెప్పింది భార్య.

 
ఈ నేపధ్యంలో డ్యూటి నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న పోలీసును మధ్యలో అడ్డుకున్నాడు ఇఫ్తికార్. అతడిని కత్తితో బెదిరిస్తూ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కత్తితో అతడి ముక్కు, చెవులు, మర్మాంగం కోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన పోలీసును ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. ఐతే అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్లు వైద్యులు తెలిపారు.