గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 27 జులై 2022 (18:02 IST)

స్నేహితులిద్దరూ ఒకే స్త్రీతో అక్రమ సంబంధం, హత్య చేసి పరారైన ఫ్రెండ్

Affair
ఒకే స్త్రీతో ఇద్దరు స్నేహితులు అక్రమ సంబంధం పెట్టుుకున్నారు. ఇది ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు-ఆళ్లవారిపాలెంలో జరిగింది.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న 38 ఏళ్ల శ్రీనివాసరెడ్డి భద్రిరాజుపాలెంకి చెందిన శ్రీకాంత్ రెడ్డి ఇద్దరూ స్నేహితులు. ఐతే శ్రీకాంత్ రెడ్డికి ఆళ్ల మిధునతో అక్రమ సంబంధం వుంది. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి తరచూ స్నేహితుడి ఇంటికి వస్తూ అతడు కూడా మిధునతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై స్నేహితుల మధ్య తేడాలు వచ్చినట్లు సమాచారం.

 
సోమవారం నాడు రాత్రివేళ శ్రీనివాసరెడ్డి మిధున ఇంటికి వెళ్లాడు. ఐతే తెల్లవారు జామున అతడు శవమై తేలాడు. అతడిని గొడ్డలి, కత్తితో దారుణంగా నరికి హత్య చేసారు. అతడి స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డి ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి మిధునతో కలిసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.