శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (23:11 IST)

హత్యకు గురైన టీనేజీ ఫుట్ బాలర్‌ చివరి గోల్ కొట్టాడు.. ఎలా?

last goal
last goal
మెక్సికోలో టీనేజీ ఫుట్ బాలర్‌ హత్యకు గురయ్యాడు. అయితే చివరి గోల్‌తోనే అత‌డికి వీడ్కోలు పలకాలను సహచరులు అనుకున్నారు. అంతే మిత్రుడి మృత‌దేహాన్ని శ‌వ‌పేటిక‌లో పెట్టారు. 
 
ఓ గోల్ పోస్ట్ ముందు శ‌వ‌పేటిక‌ను పెట్టారు. ఓ స‌హ‌చ‌రుడు గోల్ కీప‌ర్ అవ‌తారం ఎత్తితే.. మిగిలిన వారు శ‌వ‌పేటిక‌లోని మిత్రుడితో క‌లిసి మైదానంలో ఆట ఆడుతున్న తీరుగా నిల‌బ‌డ్డారు. 
 
చివరికి మృతుడి స‌హ‌చ‌రుడు ఫుట్ బాల్‌ను కాలితో త‌న్నాడు. ఆ బాల్‌ను అందుకున్న మ‌రో మిత్రుడు దానిని నేరుగా శ‌వ‌పేటిక‌కు గురి పెట్టాడు. ఆ బాల్ శ‌వ‌పేటిక‌ను తాకి నేరుగా గోల్ పోస్ట్‌లోకి వెళ్లింది. 
 
అంతే... శ‌వ‌పేటిక‌లోని త‌మ మిత్రుడే గోల్ కొట్టాడంటూ అత‌డి మిత్రులంతా శ‌వ‌పేటిక‌పై ప‌డి అత‌డిని అభినందిస్తూ అలా కొన్ని సెక‌న్ల పాటు ఉండిపోయారు. 
 
క‌న్నీళ్లు పెట్టిస్తున్న ఈ దృశ్యం మెక్సికోలో చోటుచేసుకుంది. ఈ వీడియోను ఆర్ఎస్‌పీ గోయెంకా చైర్మ‌న్ హ‌ర్ష్ గోయెంకా ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది.