సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 డిశెంబరు 2021 (12:40 IST)

గుండెపోటుతో అల్జీరియా ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి

వివాహం చేసుకున్న అల్జీరియాకు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. అతడి మృతితో ఫుట్‌బాల్ ప్రపంచం నివ్వెరపోయింది. సోఫియాన్ లౌకర్ (30) మౌలౌడియా సైదాకు సారథ్యం వహిస్తున్నాడు. ఒరాన్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది.
 
అల్జీరియాకు చెందిన ఫుట్‌బాల్ ప్లేయర్ మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వివరాల్లోకి వెళితే.. సోఫియాన్ లౌకర్ (30) మౌలౌడియా సైదాకు సారథ్యం వహిస్తున్నాడు. 
 
హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలడానికి ముందు తన జట్టు గోల్‌కీపర్‌ను ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. దీంతో తలకు గాయమైంది. మైదానంలో చికిత్స అందించిన తర్వాత మ్యాచ్ ఆడేందుకు అనుమతి పొందాడు. ఆ తర్వాత 9 నిమిషాలకే గుండెపోటుతో మరణించడంతో జట్టు సభ్యులు షాక్‌లోకి వెళ్లిపోయారు. కాగా, లౌకర్ కొన్ని వారాల క్రితమే వివాహం చేసుకున్నాడు.