మంగళవారం, 18 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 జులై 2022 (12:06 IST)

మెక్సికోలో కూలిన హెలికాఫ్టర్ - 14 మంది మృతి

helicopter
మెక్సికో నగరంలో బ్లాక్ హాక్ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హెలికాఫ్టర్ కూలిపోయిన ప్రమాదంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
మరోవైపు, కరుడుగట్టిన, అతిపెద్ద డ్రగ్ డాన్ రాఫెల్ కారో క్వింటరోను నేవీ అధికారులు అరెస్టు చేశారు. అయితే, హెలికాఫ్టర్ కూలిపోవడానికి, ఈ డ్రగ్ డాన్‌కు ఏదేని సంబంధం ఉందా ని ఆరా తీస్తున్నారు. 
 
గత 1985లో యూఎస్ యాంటీ నార్కోటిక్స్ ఏజెంట్‌న చిత్ర హింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో రాఫెల్, ప్రధాన నిందితుడని నేవీ తెలిపింది. అలాంటి రాఫెల్‌ను దేశంలోని మాదక ద్రవ్యాల రవాణా కేంద్రాలలో ఒకటైన వాయువ్య రాష్ట్రమైన సినాలోవాలోని చోయిక్స్ మునిసిపాలిటీలో అరెస్టు చేసినట్టు పేర్కొంది.