మంగళవారం, 9 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : సోమవారం, 8 డిశెంబరు 2025 (17:07 IST)

Suman: సినిమా వాళ్ళు ఏమైనా చెప్తే ప్రజలు వింటారు : సుమన్

Suman, Pratani Ramakrishna Goud, Aksha Khan, Kiran, C Kalyan
Suman, Pratani Ramakrishna Goud, Aksha Khan, Kiran, C Kalyan
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాణ దర్శకత్వంలో  బిఎస్ రెడ్డి సమర్పణలో ఢీ జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్ గా, కిరణ్ హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం RK దీక్ష. తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక,  రోహిత్ శర్మ  కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీతం అందించగా మేఘన శ్రీను ఎడిటర్ గా పనిచేశారు. హీరో సుమన్ గారి చేతుల మీదగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత సి కళ్యాణ్, తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, తెలుగు చిత్ర నిర్మాత మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
చిత్ర దర్శక నిర్మాత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ... ఈ సినిమా సుమారు ఒక సంవత్సరంలో పూర్తి చేశాము. 5 పాటలు, 3 ఫైట్స్ తో, మరి కొంత మంది ఆర్టిస్టులతో సినిమా చాలా బాగా వచ్చింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ కు ఒక పాట ఈ సినిమా ద్వారా అంకితం చేశాము. జవాన్ లకు మనం ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండాలి. ప్రేక్షకులు అంతా కలిసి మా సినిమాను ఆశీర్వదించి గొప్ప విజయం అందించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
 
హీరో సుమన్ మాట్లాడుతూ, దేశం కోసం దేనికైనా సిద్ధమైన జవాన్లను తలుచుకుంటూ ఈ సినిమాలో దేశ సైనికుడు గురించి ఒక పాట పెట్టారు. మనం ఇంత సేఫ్ గా ఉన్నామంటే దానికి కారణం దేశ జవాన్లు. నిర్మాతలు అందరూ తమ సినిమాలలో జవాన్లకు సంబంధించి బాధ్యతగా తీసుకొని ప్రతి సినిమాలో వారిని సపోర్ట్ చేస్తూ చూపించవలసిందిగా కోరుకుంటున్నాను. సినిమా వాళ్ళు ఏమైనా చెప్తే ప్రజలు వింటారు. ఈ సినిమాలో జవాన్ల గురించి అలాగే చెప్పారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా ద్వారా మంచి పేరు రావలసిందిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
నిర్మాత సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ... "ఎన్నో దీక్షలు చేసి ఇంత కష్టపడి తీసిన ఈ RK దీక్ష చిత్రం మంచి విజయం సాధించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలి. నటినటులకు మంచి ప్రశంసలు అందుకోవాలి. సుమన్ గారు ఈ సినిమాకి సపోర్ట్ చేయడం సంతోషాన్ని ఇస్తుంది. చిత్ర బంధం అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ ఆఫ్ తెలుపుకుంటున్నాను" అన్నారు.
 
హీరో కిరణ్ మాట్లాడుతూ, ఈ సినిమాలో సింగిల్ షాట్ లో సంస్కృత డైలాగ్ ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. సినిమా కోసం అంతా చాల కష్టపడి పని చేశాము. అందరూ మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అన్నారు.