శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 9 జులై 2022 (22:19 IST)

ఇంట్లోకి జొరబడి మహిళపై అత్యాచారం చేసిన సీఐ

rape
ప్రజలను రక్షించాల్సిన పోలీసు అధికారే కామాంధుడుగా మారి మహిళపై అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. వెస్ట్ మారేడ్‌పల్లి పోలీసు స్టేషనులో పనిచేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషను పరిధిలో వున్న మహిళపై కన్నేసాడు.


ఈ క్రమంలో ఆమె ఒంటరిగా వున్న సమయంలో ప్రవేశించి అత్యాచారం చేసాడు. ఇంతలో భర్త ఇంట్లోకి రావడంతో తన వద్ద వున్న సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి ఇద్దరినీ తన కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసాడు.

 
ఇబ్రహీంపట్నం చెరువు కట్టవద్దకు రాగానే కారుకు ప్రమాదం జరిగింది. దీనితో బాధితులు అక్కడి నుంచి తప్పించుకుని నేరుగా వనస్థలిపురం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఐను అదుపులోకి తీసుకున్నారు. గతంలో బంజారాహిల్స్ పీఎస్ లో ఎస్.ఐగా విధులు నిర్వహించిన సమయంలో పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు తేలడంతో ఆయన్ని మారేడ్ పల్లి పోలీసు స్టేషనుకు బదిలీ చేసారు.