సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జులై 2022 (12:49 IST)

వృద్ధుడిపై పోలీస్ కానిస్టేబుల్ దాడి.. వీడియో వైరల్.. సస్పెన్షన్

Police
Police
మధ్యప్రదేశ్‌లో వృద్ధుడిపై పోలీస్ కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. జబల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో ఒక వృద్ధుడు పోలీసు కానిస్టేబుల్‌తో, అక్కడి ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో కోపం తెచ్చుకున్న అనంత్ మిశ్రా అనే కానిస్టేబుల్ వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు. రైల్వే స్టేషన్‌లోనే వృద్ధుడిని కాలితో తన్నాడు.
 
ఆ తర్వాత అక్కడ్నుంచి లాక్కుని వెళ్లి, ప్లాట్‌ఫామ్‌పై తలకిందులుగా వేలాడదీశాడు. ఆ తర్వాత కూడా అతడిపై కాలితో చాలాసార్లు తన్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్లెవరూ పోలీసును అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అయితే, రైలులో ప్రయాణికుల్లో ఒకరు ఈ ఘటనను వీడియో తీశారు. 
 
తర్వాత ఆ వీడియోను షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. దాడికి పాల్పడ్డ పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.