గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (17:41 IST)

ఖాకీ కాదు... కీచకుడు : మైనర్ బాలికకు అశ్లీల వీడియోలు

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ మైనర్ బాలికకు అశ్లీల వీడియోలను పంపిస్తూ వేధించసాగాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ ఖాకీ కీచకుడిని పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన రాజ‌స్ధాన్‌లోని అజ్మీర్‌లో వెలుగుచూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పిసంగ‌న్ పీఎస్‌లో ప‌నిచేసే ఓ కానిస్టేబుల్ మైన‌ర్ బాలిక‌కు అభ్యంత‌ర‌క‌ర మెసేజ్‌లు, వీడియోలు పంపాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళింది. 
 
సింగ్ గ‌త కొద్ది నెల‌లుగా బాలిక‌ను వేధిస్తున్నాడ‌ని నిందితుడిపై ఫిర్యాదు చేసిన పిసంగ‌న్ పంచాయితీ స‌మితి స‌భ్యుడు ప్ర‌దీప్ కుమ‌వాత్ వెల్ల‌డించారు. దీంతో నిందితుడు విక్రం సింగ్‌పై ఐటీ, పోక్సో చ‌ట్టాల కింద కేసు న‌మోదు చేశారు. 
 
ఫిర్యాదు ఆధారంగా కానిస్టేబుల్ సింగ్‌పై కేసు న‌మోదు చేశామ‌ని, ద‌ర్యాప్తు అనంత‌రం నిందితుడిని అరెస్ట్ చేస్తామ‌ని అజ్మీర్ ఎస్పీ జ‌గదీష్ చంద్ర శర్మ తెలిపారు. నసీరాబాద్ స‌ద‌ర్ పోలీస్ స్టేష‌న్ ఇన్‌చార్జ్ ఈ కేసును విచారిస్తున్నార‌ని పోలీసులు చెప్పారు.