గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 మే 2022 (20:03 IST)

జమ్మూకాశ్మీర్‌‍లో ఉగ్రమూకల దాడి.. పోలీస్ కానిస్టేబుల్ మృతి

జమ్మూ కాశ్మీర్‌‌లో ఉగ్రవాదులు పెచ్చరిల్లిపోతున్నారు. తాజాగా ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఇంటి వద్ద కాల్పులు జరిపారు. ఏడేళ్ల కూతురి ముందే అతడిని కాల్చేశారు. ఈ దాడిలో పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతిచెందగా.. అతడి కూతురికి గాయాలైనట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఉగ్రదాడిలో తొలుత తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో మృతి చెందిన పోలీస్‌ను శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతానికి చెందిన సైఫుల్లా ఖాద్రిగా గుర్తించినట్టు తెలిపారు. 
 
అయితే, బాలిక కుడి చేతికి బుల్లెట్‌ గాయం తగిలిందని.. ఆమె ప్రాణాలకు ప్రమాదం లేదన్నారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు, ఈ ఘటనపై కాశ్మీర్‌ రేంజ్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.