బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (22:01 IST)

ప్రియాంక చోప్రా గారాలపట్టి పేరేంటో తెలుసా?

Nick Jonas
మాజీ విశ్వసుందరి, ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. గ్లోబల్ నటిగా మంచి పేరు కొట్టేసింది. అమెరికన్ యాక్టర్ కమ్ సింగర్ నిక్ జోనస్ ఆమె 2018లో వివాహం చేసుకుంది. 
 
ఇటీవలే ఈ దంపతులు సరోగసీ విధానం ద్వారా ఒక బుజ్జి పాపాయిని తమ జీవితాల్లోకి ఆహ్వానించారు. తాజాగా ప్రియాంక, నిక్ దంపతులు తమ ముద్దుల కూతురికి మాల్తీ మేరీ చోప్రా జోనస్ అని నామకరణం చేశారు. ఎంతో పరిశోధించి ప్రియాంక ఈ పేరును ఎంపిక చేసిందట.
 
మాల్తీ అంటే చిన్న పువ్వు అని, మేరీ అంటే జీసస్ తల్లి మరియా అని, ఇక చివరిలో తమ ఇద్దరి ఇంటిపేర్లు కలిసి వచ్చేలా చోప్రా జోనస్ అని పెట్టినట్టు తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి వుంది.