సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జనవరి 2022 (20:17 IST)

సీక్రెట్‌గా తల్లి అయిన ప్రియాంకా చోప్రా: పుట్టింది ఆడ బిడ్డా? లేదా..? (video)

గ్లోబల్ స్టార్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా సీక్రెట్‌గా తల్లి అయ్యింది. సరోగసి విధానంలో ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నికో జోనస్ తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని ఇద్దరు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అయితే ప్రియాంక జోనస్ దంపతులకు పుట్టింది ఆడ బిడ్డా? లేదా మగ బిడ్డ అనేది రివీల్ చేయలేదు. 
 
ఈ సమయంలో తమకు ప్రైవసీ ఇవ్వాలని ప్రియాంక తన అభిమానులను కోరింది. అద్దె గర్బం విధానంలో బిడ్డకు జన్మనిచ్చినట్టు వెల్లడించారు. 
 
అమెరికన్ వెబ్‌సైట్ ప్రకారం.. ప్రియాంక చోప్రాకు ఆడ పుట్టినట్లు సమాచారం. కాలిఫొర్నియాలోని ఓ ఆస్పత్రిలో శనివారం పాపకు ప్రియాంక జన్మనిచ్చినట్టు తెలిపింది.
 
అయితే ప్రియాంక చోప్రా గర్భం దాల్చినట్టు ఎలాంటి వార్త బయటకు రాలేదు. ఆమె గర్భంతో కనిపించిన సందర్భాలు లేవు. తామిద్దరూ తల్లిదండ్రులు అయినట్టుగా ప్రియాంక, జోనస్ ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.