సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 28 డిశెంబరు 2021 (13:16 IST)

2022 నూతన సంవత్సరం సందర్భంగా ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ సందేశం

ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ రాబోయే 2022 నూతన సంవత్సరం సందర్భంగా సందేశమిచ్చారు. ఆయన మాట్లాడుతూ... గత రెండేళ్లుగా మానవ సమాజం అనేక సవాళ్లను ఎదుర్కొంది. మహమ్మారిని గత రెండు సంవత్సరాల్లో చాలా ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్నాం.

 
ఇక కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. యోగ, ధ్యానం చేయడం ద్వారా సరైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనం మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా, మన ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకుందాము. ఇతర విషయాలపై కాస్తతం సున్నితంగా వుంటూ నూతన ఉత్సాహం, గొప్ప శక్తితో ముందడుగు వేద్దాం.

 
ఈ నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు, 2022 ఆనందోత్సాహాలతో సుఖసంతోషాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను. నమస్తే''