శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 7 మే 2022 (16:13 IST)

కన్న కూతురిపైనే అత్యాచారం, రహస్య కెమేరాలో బంధించిన బాధితురాలు

rape
వావివరసలు మంటగలుస్తున్నాయి. కామాంధులు తమ రక్తసంబంధీకులను సైతం వదలడంలేదు. బీహారు రాష్ట్రంలో ఘోరం జరిగింది. విద్యాబుద్ధులు చెప్పే 50 ఏళ్ల ఉపాధ్యాయుడు తన కన్న కుమార్తెపైనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన దారుణం వెలుగుచూసింది.

 
బీహారులోని సమస్థిపూర్ జిల్లాలోని రొసెరా గ్రామంలో 50 ఏళ్ల ఉపాధ్యాయుడు తన కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక్కసారి కాదు పలుమార్లు ఆమెపై అఘాయిత్యం చేసాడు. తల్లికి ఈ విషయం తెలిసినప్పటికీ నిస్సహాయురాలిగా మిగిలిపోయింది.

 
తన తండ్రి తనపై చేస్తున్న అకృత్యాల్ని భరించలేని బాధితురాలు ఈ దారుణాన్ని ఓ రహస్య కెమేరాలో బంధించింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు న్యాయం చేయాలంటూ ప్రాధేయపడింది. పోలీసుల దృష్టికి వెళ్లడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.