శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మే 2022 (09:07 IST)

బహిర్భూమికి వెళ్లిన మహిళపై గన్ చూపెట్టి అత్యాచారం..

rape victim
బహిర్భూమికి వెళ్లిన వివాహితపై అత్యాచారం జరిగింది. గన్ చూపించి కామాంధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్, భరత్పూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ బుధవారం బహిర్భూమికి వెళ్ళింది. ఎప్పటినుంచో ఆమెపై కన్నేసిన ఉస్మాన్ అనే వ్యక్తి… ఆ మహిళను వెంబడించాడు.
 
సమీప అటవీ ప్రాంతం నుంచి తిరిగి వస్తున్న క్రమంలో మహిళలు అడ్డగించాడు. తన కోరిక తీర్చాలని వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తుపాకీ చూపించి బెదిరించాడు. ఆమెను తీవ్రంగా కొట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
 
చివరికి నిస్సహాయ స్థితిలో తనను కాపాడాలని ఆమె కేకలు వేసింది. బాధితురాలి అరుపులు విన్న కొందరు అక్కడికి చేరుకున్నారు. ఆపై స్థానికులు అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత మహిళలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.